Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏవో ప్రభాకర్ రావ్
నవతెలంగాణ-దోమ
పీఎం కిసాన్ నిధుల కోసం రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని మండల ఏవో ప్రభాకర్ రావ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈ పథకం ప్రక్షాళనకు ఈ కేవైసీ ప్రవేశపెట్టడమైనదనీ, 2.2.2019 తర్వాత వచ్చిన పట్టా రైతులు అనర్హులనీ, కొందరి రైతుల ఆధార్ నంబరు ఆక్టివేట్ లేకపోవడం, ఆధార్ నంబర్‌కు లింక్ అయిఉన్న మొబైల్ నంబర్లు పనిచేయకపోవడం, పనిచేసే కొత్త నంబర్లతో లింకు చేసుకోకపోవడం ఇప్పుడు గ్రామ పోస్ట్ ఆఫీస్‌లో కూడా ఆధార్ మొబైల్‌తో లింక్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ కేవైసీ చేయించుకున్న రైతులు కూడా అమౌంట్ రాకపోతే బ్యాంకులో కూడా ఈ కేవైసీ చేయిం చుకోవాలన్నారు. ఒకే కుటుంబంలో ఒకే మొబైల్ నెంబర్‌తో ఇద్దరి, ముగ్గురి పట్టా, ఆధార్‌కు లింక్ ఉన్నకాని ఈకెవైసీ కాదనీ, ఒక రేషన్ కార్డుపై ఉన్న భార్య భర్తలలో ఒకరే అర్హులని, ఇన్కామ్ఈ టాక్స్ కట్టే ప్రయివేట్ ప్రభుత్వ ఉద్యోగులు డాక్టర్స్, లాయర్స్, పెన్షనదారులు, జడ్పీ చైర్మన్ ఆపై మాజీ /ప్రస్తుత ప్రజా ప్రతినిధులకు పిఎం కిసాన్ ఉండదన్నారు. సీఎస్సి సెంటర్లలో లేదా రైతుల మొబైల్ ఫోన్లలో స్వతహాగా అప్లై చేసుకున్న రైతులు సంబంధిత పత్రాలతో వ్యవసాయశాఖ అధికారులనూ తప్పనిసరిగా సంప్రదించి అప్రూవ్ చేసుకోవాలన్నారు.