Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు
- ఎస్సై రవి గౌడ్
నవతెలంగాణ-కొడంగల్
వాహనదారులు విధిగా రోడ్డు నిబంధనలను పాటించాలని ఎస్సై రవి గౌడ్ అన్నారు. గురువారం కొడంగల్ సమీపంలోని చిట్లపల్లి గేటు వద్ద వాహనదారులకు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవి గౌడ్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు. మద్యం తాగి నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. శిక్షలు కాదు, వాహనదారులో మార్పు రావాలన్నారు. వాహన దారులు ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించినప్పుడే ఎలాంటి ప్రమాదాలూ జరగవని అన్నారు. నిర్లక్ష్యం, మద్యం డ్రైవింగ్తో ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయని వారిని నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. వాహనం నడిపేటప్పుడు వారి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుంటే వాహనదారులు నియమ నిబంధనలతో డ్రైవింగ్ చేస్తారన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.