Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలకోసారి తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసుకోవాలి
- వారానికి మూడుసార్లు గుడ్డు ఇవ్వాలి
- మంబాపూర్ పాఠశాలను తనిఖీ
- జిల్లా విద్యాధికారి రేణుక
నవతెలంగాణ- పెద్దేముల్
విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారి రేణుక హెచ్చరించారు. గురువారం పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుక సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... విద్యార్థుల తల్లి దండ్రులతో ఉపాధ్యాయులు సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. వారంలో మూడుసార్లు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో తో పాటు గుడ్డును అందజేయాలని వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. పాఠశాలలో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యత ఉపాధ్యాయలేదని తెలిపారు.