Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మహిపాల్, కార్యదర్శి రామకృష్ణ
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మహిపాల్, కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రెండు రోజులు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం ఆశావర్కర్లు యూనియన్ జిల్లా అధ్యక్షులు మంగమ్మ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశావర్కర్లకు సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలన్నారు. అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా రూ.10లక్షలు కల్పించాలన్నారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఆశావర్కర్లపై పని ఒత్తిడి తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఉపాధ్యక్షులు చంద్రయ్య, ఆశావర్కర్లు సుజాత, మాధవి, పద్మ, స్వరూప, ఉమా, అండాలు, శోభారాణి, పద్మ, నర్సమ్మ, మంగమ్మ, అలవెలు, లక్ష్మి, శంకరమ్మ, రాజమ్మ, వెంకటమ్మ పాల్గొన్నారు.