Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాములు
నవతెలంగాణ-రాజేంద్రనగర్
ట్రాన్స్‌ఫోర్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాములు అన్నారు. గురువారం కాటేదాన్‌లో రంగారెడ్డి జిల్లా తెలంగాణ రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చలానాల పేర్లతో ట్రాన్స్పోర్ట్ కార్మికుల తీవ్రంగా వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గతంలో అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2019 మోటార్ వెహికల్ వాహన చట్టాన్ని రద్దు చేయాలి, హైవే రోడ్డుపై హెవీ వెహికల్స్ పైన గ్రీన్ టాక్స్ రోడ్డు టాక్స్ ధరలను తగ్గించాలి, టోల్గేట్ చార్జీలను తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై జీఎస్టీని వర్తింపజేయాలని, ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో సిద్దిపేటలో జరిగే సీఐటీయూ మహాసభల్లో అనేక తీర్మానాలు చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఉద్యమ పోరాటాలు చేసి, కార్మికులకు రావాల్సిన హక్కుల కోసం పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రోడ్డు ట్రాన్స్ ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి రుద్ర కుమారు, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, జిల్లా కమిటీ సభ్యులు మల్లేష్, మహేష్, శివ, కొండల్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.