Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని పాలేపల్లికి చెందిన ఉప్పరి యాదయ్య విద్యుత్ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. కానీ తన నివసిస్తున్న ఇంటికే 10 ఏండ్లు విద్యుత్ మీటర్ లేకుండా విద్యుత్ వైర్లకే కొండీలు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నాడు. తాను విద్యుత్ సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తు న్నందుకే విద్యుత్ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని చుట్టూ పక్కల ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ కొండీలు అకస్మాత్తుగా ఊడి తే ప్రమాదాలకు గురి అయ్యే పరిస్థితి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. ఇలాంటి వారిపై విద్యుత్ వెంటనే ఉన్నత చర్యలు తీసుకోవాలని గ్రామ స్తులు డిమాండ్ చేశారు.