Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్
- ఈ నెల 21 నుంచి 23 తేది వరకు మహాసభలు
నవతెలంగాణ- రాజేంద్రనగర్
సిద్దిపేటలో ఈనెల 21 నుంచి 23 వరకు జరిగే రాష్ట్ర సీఐటీయూ నాలుగో మహాసభలను విజయవంతం చేయా లని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం కాటేదాన్‌లోని రంగారెడ్డి జిల్లా సీఐటీయూ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామ్మోహన్‌తో కలిసి చంద్రమోహన్ సీఐటీయూ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతీ ఒక్క కార్మికునిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. 23న సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొ నాలని ఆయన అన్నారు. ఈ మహాసభల్లో కార్మికులు ఎదు ర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికి భవిష్య త్తులో చేయవలసిన పోరాటాల గురించి సుదీర్ఘంగా చర్చి స్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కురుమయ్య, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రుద్రకుమార్, స్వామి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.