Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి డివిజన్లో డివిజన్ అధ్యక్షులు రాజు శెట్టి కురుమ అధ్యక్షతన, యువ నాయకులు గట్టుపల్లి కిరణ్ అధ్వర్యంలో గజ్జల యోగానంద్ సమక్షంలో ఆది వారం పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా యో గానంద్ మాట్లాడుతూ బీజేపీతోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమన్నారు. దేశం అభివృద్ధిలో దూసుకు పోతుంటే శేరిలింగంపల్లి మాత్రం అభివృద్ధి కుంటుపడిం దన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకూ అన్యాయం జరుగుతుందన్నారు. కేసీఆర్ హామీ ఇచ్చిన ఉద్యోగ నోటిఫ ికేషన్లు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి వారిలో నైపుణ్యం, సజనాత్మక పెంపొం దించేందుకు 'స్కిల్ ఇండియా' ద్వారా అనేక కోర్సులను ప్రారంభించి అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్విని యోగం చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో శేరిలింగంపల్లిలో ఎగిరేది బీజేపీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం తారానగర్ తుల్జా భవాని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా వచ్చిన యువకులను చందానగర్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్య క్రమంలో జిల్లా బీజేవైఎం నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చ నాయకురాలు బీమని విజయ లక్ష్మి, డివిజన్ ప్రధాన కార్యదర్శులు చిట్టా రెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి, సత్య కురుమ, సి.హెచ్ బాలరాజు, ఆకుల సందీప్, బాపు జీ, కిషోర్, దిలీప్ పాల్గొన్నారు.