Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల అధ్యక్షుడు కొమ్ము మహేష్
- మాల్లో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-యాచారం
మండలంలో ఎమ్మార్పీఎస్ బలోపేతమే లక్ష్యంగా మాదిగలు పనిచేయాలని ఆ సంఘం మండల అధ్యక్షుడు కొమ్ము మహేష్ సూచించారు. ఆదివారం యాచారం మండల పరిధిలోని మాల్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూ తన కమిటీని ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా చిన్నోళ్ల యాదయ్య, ఉపాధ్యక్షుడిగా జంగిలి యాదయ్య, అధికార ప్రతినిధిగా, జంగయ్య, ప్రధాన కార్య దర్శి చిన్నోల్ల శ్రీశైలం, కార్యదర్శిగా పెద్దల రమేష్, కోశాధికారిగా నల్లవెల్లి లక్ష్మయ్య, ప్రచార కార్యదర్శి, సంజీ వ, సలాదారునిగా మాజీ సర్పంచ్ చిన్నోల్ల జహంగీర్, గడ్డమీది మదర్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కొమ్ము మహేష్ మాట్లాడుతూ మందకృష్ణమా దిగ ఎమ్మార్పీఎస్ అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. దేశంలో, రాష్ట్రంలో మాదిగల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. మాదిగలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు మందకృష్ణమాదిగ ప్రభుత్వాలతో పోరాటాలు సాగిస్తున్నా రని చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా మాదిగలం తా ఐకంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మంద లింగం, మూలి మహేష్, తదితరులు పాల్గొన్నారు.