Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరుగుదొడ్లు శుభ్రం చేయించడం దారుణం
- గిరిజన విద్యార్థినులపై విద్యాశాఖ అధికారులకు ప్రేమ లేదు
- పీడీఎస్‌యూ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్‌రెడ్డి
- గిరిజన బాలికల వసతి గృహం సందర్శన
నవతెలంగాణ-తాండూరు
తాండూరులో విద్యాధికారుల మొద్దు నిద్రలో ఉన్నా రని పీడీఎస్‌యూ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణ కేంద్రంలోని సాయిపూర్ ప్రభుత్వ నెంబర్ వన్ పాఠశాల వెనుకాల ఉన్న గిరిజన బాలికల వసతి గృహంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న గిరిజన బాలికలతో మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ కేంద్రంలోని సాయిపూర్ ప్రభుత్వ నంబర్-1 పాఠశాల వెనకాల ఉన్నటువంటి గిరిజన బాలికల వసతి గహంలో రెండేండ్ల నుంచి హాస్టల్ పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారని అన్నారు. రెండు, మూడో తరగతి చదువుతున్న చిన్నారి గిరిజన బాలికలతో మూడంతస్తుల వరకు ఉన్న భవనం పైకి బకెట్లతో నీళ్లను మోపిస్తున్నారని అన్నారు. ఆదివారం పాఠశాలను పీడీఎస్‌యూ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థినులు తమ గోడును వెల్లబోసుకున్నారు. గిరిజన హాస్టల్ విద్యార్థినులు మాట్లాడుతూ హాస్టల్లో మరుగు దొడ్లను శుభ్రం చేయించడమే కాకుండా, హాస్టల్ ఆవరణలో పెరుగుతున్న గడ్డిని సైతం తమతో తీయిస్తున్నారని అన్నారు. తాగునీటి ట్యాంకులను కూడా శుభ్రం చేయిస్తున్నారని అన్నారు. అదేమిటీ, ఎందుకు అని అడిగితే తమను కొడుతున్నారంటూ విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. అలాగే హాస్టల్లో నెలకొన్న సమస్యలపై మాట్లాడుతూ జ్వరం ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడితే కనీసం టాబ్లెట్లు కూడా ఇవ్వరని అన్నారు. ప్రతిరోజూ కూడా మెనూ ప్రకారం భోజనం అందించకుం డా నీళ్ల చారు, అన్నం మాత్రమే వడ్డిస్తున్నారని, విద్యుత్ అంతరాయంతో చదువుకునేందుకు కూడా ఆవస్థలు పడుతున్నామని తెలిపారు. అలాగే హాస్టల్లోఉంటూ కాలేజీ చదువుతున్న విద్యార్థినుల స్కాలర్షిప్లను కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న పి డి ఎస్ యు వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు దీపక్‌రెడ్డి సంఘటన స్థలా నికి చేరుకొని విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా దీపక్‌రెడ్డి మాట్లాడుతూ విద్యను అభ్యసిస్తున్న చిన్నారులతో మరుగుదొడ్లను శుభ్రం చేయి స్తూ వెట్టిచాకిరి చేయిస్తున్న హాస్టల్ వార్డెన్, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఇదే హాస్టల్ విద్యార్థినులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్య క్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు సోయాబ్, శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.