Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రగ్స్ వ్యవహారం విషయంలో చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న యువకులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ తాండూర్ మండల నాయకులు
నవతెలంగాణ- తాండూరు రూరల్
వికారాబాద్ జిల్లా గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మురళీకృష్ణ గౌడ్ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాండూర్ మండలానికి చెందిన యువకులు ప్రశాంత్‌కుమార్, కే.రాజు పలువురు యువకులతో కలిసి కరణ్‌కోట్ పోలీసులకు మురళీకృష్ణగౌడ్పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రాకేష్‌గౌడ్, రేణుక ఎల్లమ్మ దేవాలయ చైర్మన్ సందీప్‌రెడ్డి యువకులు ప్రశాంత్, రాజు విలేకరులతో మాట్లాడారు. యువకులను డ్రగ్స్ విహారంలోకి లాగుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి వ్యవహారాలలో యువతను లాగితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. యువతకు చేసిందేమీ లేదన్నారు. యువతను మభ్యపెట్టి మోసం చేసింది మీరు కాదా అని మండిపడ్డారు. తాండూ రు యువత డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని మాట్లాడడం సరికాదన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుబోమ ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుర్రంపల్లి రాందాస్, సీనియర్ నాయకు లు పటేల్ ఉమాశంకర్, మల్కాపూర్ గని కార్మిక సొసైటీ (డైరెక్టర్) పీఐసీ సభ్యుడు కోతి గోపాల్, బీసీ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, చెన్‌గేష్‌పూర్ ఆంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ ప్రశాంత్కుమార్గౌడ్, బీఆర్ఎస్ ప్రచార కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌గౌడ్, మహిళా నాయకు రాలు శకుంతల, యాదప్ప, సర్పంచులు నరేందర్‌రెడ్డి, సాయిలు, ప్రశాంత్ దేశ్‌పాండే, రాకేష్‌గౌడ్, కుమ్మరి జగదీష్, బోయిని రాజు, మహేష్ గౌడ్, ప్రవీణ్ చారీ, రాజు యాదవ్, ధర్మయ్యగౌడ్, హంజధ్, విజయ్, మహేష్ గౌడ, సతీష్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.