Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 250 యూనిట్ల ఉచిత హామీ గాలికి..
- 3 నెలలు ఉచితం
- తరువాత మొత్తం కలిపి బిల్లు
- వికారాబాద్ పట్టణంలో ఘటన
- ఖండించిన తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు రమేశ్
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం నాయీ బ్రహ్మణుల అభివృద్ధి కోసం వారి షాప్‌లకు 250యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చింది. కొన్ని నెలల నుంచి ఇది అమలు అవుతోంది. అయితే వికారాబాద్ పట్టణంలోని ఓ షాప్‌కి విద్యుత్ అధికారులు బిల్లు వేశారు. మొదటి రెండు నెలలు బిల్లు రాలేదు. ఆ తరువాత మూడో నెలల బిల్లు ఒకేసారి వేశారు. విద్యుత్ బిల్లు చెల్లించాలని ఒత్తిడి తేస్తున్నారు. దీంతో బాధితుడు మంగలి విజరుకుమార్ లబోదిబోమంటు న్నాడు. దీన్ని సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రమేశ్ ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 250 యూనిట్ల సబ్సిడీ కింద కరెంటు ఉచితంగా ఇచ్చిందని అన్నారు. ఇందులో భాగంగా వికారాబాద్ పట్టణ కేంద్రంలో మంగలి విజరు కుమార్‌కు ఏప్రిల్‌లో సబ్సిడీ మీటర్ శాంక్షన్ అయిందని తెలిపారు. మే, జూన్, జూలై, ఆగస్టు జీరో బిల్లు వచ్చిందని వివరించారు. ఆ తరువాత 35 రోజులకే 1350 యూనిట్లు ఒకేసారి వచ్చిందని చెప్పారు. రూ. 16 వేల బిల్లు వచ్చిందని తెలిపారు. ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ వారు బిల్లు చెల్లించాలని ఒత్తిడి తేస్తున్నారని అన్నారు. లేకపోతే కరెంటు కలెక్షన్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. దీనిపై ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఆఫీసులో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇప్పు డు మళ్లీ సెప్టెంబర్, డిసెంబర్లది కలిపి రూ.12,400 బిల్లు వచ్చిందని తెలిపారు. ఎలాంటి నోటీసు లేకుండా.. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీటర్ కరెంటు కనెక్షన్ కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన షాప్‌లో ఫోన్ లైట్ వేసుకొని కటింగ్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. తన కుటుంబ జీవనం ఈ కటింగ్ షాప్ మీదనే ఆధారపడి ఉందని అన్నారు. తన షాప్‌కు ఉచిత కరెంట్ ఇచ్చి, బిల్లును రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు ధనరాజ్, ఉపాధ్యక్షులు రవికుమార్, వికారాబాద్ పట్టణ అధ్యక్షులు ఎన్.శేఖర్ ఉన్నారు.