Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జగదీశ్
- మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జగదీశ్ అన్నారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో సిద్దిపేటలో జరిగే సీఐటీయూ 4వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆదిభట్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక విధా నాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంఘం సీఐటీయూ అన్నారు. ఆ సంఘం రాష్ట్ర మహాసభలను దిగ్విజయంతం చేయాలన్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రయివేటు, కార్పొరేటు వారికి అనుకూల నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కార్మికులు నష్టపోతున్నారని తెలిపారు. స్వాతంత్రం రాక ముందు నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్ని మోడీ ప్రభుత్వం కాలరాస్తూ 4 లేబర్ కోడ్లుగా కుదించడం ద్వారా కార్మిక హక్కులను కాలరా స్తుందన్నారు. లేబర్ కోడ్ల ద్వారా కార్మికులకు ఉపయో గం కన్నా యాజమాన్యానికి అనుకూలంగా ఉన్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగు ణంగా కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యవసర సరుకుల ధరలు గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలను నియంత్రించాలన్నారు. ప్రయివేటు పరిశ్రమలో పని చేసే కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించడం లేదన్నారు. కనీస వేతనాలు ఇవ్వకుండా కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని తెలిపారు. ప్రభుత్వ స్కీం వర్కర్లుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేదన్నారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో సిద్దిపేటలో జరిగే సీఐటీయూ 4వ రాష్ట్ర మహాసభలను జయ ప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బుగ్గరాములు, రాజేం దర్, రవిబాబు, సురేష్, జంగయ్య, జయమ్మ, భూదేవి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.