Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్యధికారులను ఆదేశించిన కలెక్టర్ అమోయ్ కుమార్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో మాతా శిశుమరణాలు జరగకుండా చూసుకో వాల్సిన బాధ్యత వైద్యులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ అన్నారు. శుక్రవా రం జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో మాతా శిశుమరణాలపై జిల్లా కలెక్టర్ అమోరుకుమార్, జిల్లా అద నపు కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కేసుల వారీగా సమీక్షించారు. గర్భి ణులకు అందించే చికిత్స విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, ముఖ్యంగా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు అన్ని పరీక్షలతోపాటు, వారు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలని సూచించారు. గర్భిణులతో పా టు, భర్తకు, తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య విష యాలను తెలియజేయాలని తెలిపారు. అదే విధంగా ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పుడూ గమనిస్తూ ఉండాల న్నారు. ఈ విషయంలో వైద్యాధికారి మొదలుకొని ఏఎన్ ఎం, సిబ్బంది వరకు పూర్తి అప్రమత్తంగా ఉంటే మాత శిశుమరణాలు తగ్గుతాయని చెప్పారు. ఇకపై జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ వరదా చారి, డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.