Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నాయకులు రాధాకృష్ణ యాదవ్
నవతెలంగాణ-మియాపూర్
అభివృద్ధి పేరుతో చెరువులను నాశనం చేయొద్దని బీజేపీ శేర్లింగంపల్లి నాయకులు రాధాకృష్ణయాదవ్ అన్నా రు. మాదాపూర్లోని కామెంట్ విల్లెజ్ పరిధిలో మొండి కుంట చెరువు అభివృద్ధి పేరుతో కబ్జాకు గురవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ప్రజల తో కలిసి ఆయన చెరువులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శేర్లింగంపల్లి పరిధిలోని అనేక చెరు వులను అభివృద్ధి పేరుతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తూ చెరువు మధ్యలో మట్టి పోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను అభివృద్ధి చేయడంలో ఎవరికీ అభ్యం తరం లేదని, కేవలం అభివృద్ధి పేరుతో చెరువు చివరి భా గంలో ఉన్న స్థలాన్ని కొంతమంది నాయకులు, ప్రజాప్రతి నిధులు కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై తమ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందో ళన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రభుత్వానికి తెలిపారు.