Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైబరాబాద్ కమిషనరేట్ వార్షిక నివేదిక వెల్లడి
- సైబర్ నేరాలు కట్టడికి కృషి
- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
- సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడితో పోల్చితే ఈ ఏడాది సైబర్ నేరాలు పెరిగాయని సైబరాబాద్ కమిషనరేట్ వార్షిక నివేదికలో వెల్లడైంది. సైబర్ నేరాలు అరికట్టేందుకు కమిషనరేట్ నేతృత్వంలో ' సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను ఏర్పాటు చేసినట్టు కమిషనరేట్ అధికారులు తెలిపారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషన రేట్ కన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన 2022-వార్షిక రిపో ర్టును సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడా ది 27,322 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని తెలిపారు. 79 మందిపై పీడీ యాక్ట్లు పెట్టామని చెప్పారు. 57,175 డ్రంకన్ డ్రైవింగ్ కేసులు 13 మందిపై రౌడీషీట్లు తెరిచామని వివరించారు. 849 మందిపై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశామని వివరించారు. గతేడాదితో పోలీస్తే రోడ్డు ప్రమాదాల కేసులు 19.8 శాతం తగ్గాయని వెల్లడించారు. అపహరణ కేసులు 2021లో 244 కేసులు ఉండగా 2022లో 232 కేసులు నమోదు చేశామని తెలిపారు. స్థిరాస్తి నేరాల హత్యలు ఈ ఏడాది తగ్గాయని చెప్పారు. దోపిడీ కేసులు 99 శాతం తగ్గాయని స్నాచింగ్ కేసులు 4 శాతం తగ్గాయని చెప్పారు. రాత్రి దొంగతనాల కేసులు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 33 శాతం తగ్గాయని వివరించారు. సైబర్ నేరాలు పెరిగాయని 2021లో 3,854 కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో 4,850 కేసులు నమోదయ్యాయని చెప్పారు. సైబర్ నేరాల కట్టడికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశామని విరవించారు. గతేడాది 6,474కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది 1,788 కిలోల గంజాయి మాత్రమే పట్టుబడిం దని తెలిపారు. మాదక ద్రవ్యాలను ఈ ఏడాది పూర్తి స్థాయి లో నియంత్రించామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.