Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ పరిశీలకులు వాణీప్రసాద్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో ఓటర్ జాబితాను పకడ్బందీగా రూపొందిం చాలని రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ పరిశీలకులు వాణీ ప్రసాద్ అన్నారు. శుక్ర వారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అమోరుకుమార్తో కలిసి ఎస్ఎస్ఆర్ -2023కి సంబంధించిన యాక్టివిటీస్, జిల్లాలో ఓటరు జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పు లు, తొలగింపులు తదితర అంశాలపై ఈఆర్వోలు, ఏఈ ఆర్ఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాటా ్లడుతూ జిల్లాలో ఆయా దరఖాస్తులను డిస్పోజల్ ఏ విధం గా చేశారు, ప్రాపర్‌గా చేశారా లేదా అన్న విషయాలపై ఆరా తీశారు. డెత్ కేసుల విషయంలో ఓటర్ జాబితాలో అన్ని అప్డేట్ చేయాలన్నారు. బీఎల్వోలు ఆయా గ్రామాల్లో క్షేత్ర పరిధిలో పరిశీలించి, చనిపోయిన వారి వివరాలు, మరణ ధ్రువీకరణ, ఇతర వివరాలను సంబంధిత కుటుం బం నుంచి గాని గ్రామ పంచాయితీ నుంచి గాని సేకరిం చాలన్నారు. తొలగింపులకు సంబంధించి ప్రాపర్‌గా జాగ్రత్తగా చేయాలన్నారు. ఫారం-7కు సంబంధించి నోటీ సులు ఇవ్వాలని, వెరిఫై చేసి ధ్రువీకరణ తీసుకోవాల న్నారు. తిరస్కరించిన వాటికి సరైన కారణాలను పేర్కొ నాలని సూచించారు. చ్చిన దరఖాస్తులను పరిష్కరించా లన్న ఆలోచనతో కాకుండా, సమస్యలను పరిష్కరించాలని ఆలోచించాలన్నారు. బీఎల్ఓ స్థాయిలోనే తప్పులు జరగ కుండా చూడాలన్నారు. మరణించిన ఓటర్లను జాబితా నుంచి తొలగించాల్సిన బాధ్యత ఏఈఆర్ఓలేదని అన్నారు. ప్రోయాక్టివ్‌గా చేయాలన్నారు. ఈ సందర్భంగా నియోజ కవర్గం వారీగా ఫారం 6-69, 7-20, 8-32 లకు సంబంధించి సూపర్ చెక్ దరఖాస్తులను ఎలక్ట్రోరల్ రోల్ పరిశీలకులు వాణీ ప్రసాద్, జిల్లా కలెక్టర్ అమోరు కుమా ర్లు పరిశీలించారు. అనంతరం ఆమె ఫారం-6, 7, 8 సూపర్ చెక్ చేయాలని ఈఆర్ఓలకు సూచించారు. చనిపో యిన, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, మార్పులు చేర్పుల విషయంలో పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ అమోరు కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఫారం 6,7,8 లకు సంబంధించి దరఖాస్తులు పరిశీలన చేసినట్టు ఎలక్ట్రోరల్ రోల్ పరిశీలకులకు తెలిపారు. దాదాపు 95 శాతం పరిష్కరించామని, 90 శాతం అప్డేట్ చేశామని తెలి పారు. రెండు రోజుల లోగా అన్ని దరఖాస్తులను క్లియర్ చేయనున్నట్టు తెలిపారు. పీడబ్ల్యూడీ ఓటర్లను వంద శాతం మార్కింగ్ చేశామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు తిరుపతిరావు, ప్రతీక్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జిల్లా పరిషత్ సీఈవో దిలీప్‌కుమార్, పీడీ డీి ఆర్డీఏ ప్రభాకర్, ఆర్డీవోలు వెంకటాచారి, రాజేశ్వరి, వేణు గోపాల్, ఏఈఆర్వోలు, ఎన్నికల విభాగపు సూపరిండెంట్, తదితరులు పాల్గొన్నారు.