Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీలకు తీరనున్న కష్టాలు
- గ్రామ సభలు, రికార్డుల భద్రతకు తీరనున్న ఇక్కట్లు
- ఎన్ఆర్ఈజీఎస్ నుంచి నిధులు మంజూరు
- హర్షం వ్యక్తం చేస్తున్న సర్పంచ్లు
రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అయితే గ్రామానికి మూలం పంచాయతీ భవనం. పంచాయతీలు ఏర్పడినప్పటికీ భవనం లేకపోవడంతో గ్రామాల్లో ఇబ్బందులు ఏర్పాడ్డాయి. సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం, పంచాయతీ రికార్డులు భద్రపరుచుకోవడం కోసం పాలకవర్గం నానా తంటాలు పడింది. గ్రామాల్లో ఉన్న పాఠశాలలు, డాక్రా సంఘాల భవనాల్లో కార్యక్రమాలు చేపట్టారు. ఎట్టకేలకు పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేసింది. గ్రామాల్లో పంచాయతీ భవనాలు పూర్తి అయితే ఇప్పటి వరకు పడ్డ కష్టాలు తీరనున్నాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్పంచ్లు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ-కొత్తూరు
పాలన సౌలభ్యం కోసం 500 జనాభా కలిగిన గిరిజన తండాలు, ఆమ్లెట్ గ్రామాలను నూతన గ్రామ పంచాయ తీలుగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నూతన భవన నిర్మాణాలకు గ్రీన్ సిగల్ ఇచ్చింది. నూతన గ్రామ గ్రామ పంచాయతీలు ఏర్పడిన నాటి నుంచి డ్వాక్రా భవనాలు, ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకొని పాలన కొనసాగిస్తున్నారు. సరైన వసతులు లేక సమావేశాల నిర్వహణ గ్రామసభల ఏర్పాటు రికార్డులు భద్రత తదితర ఇబ్బందులు ఏర్పడి నానా అవస్థలు పడుతున్నారు.
తాజాగా నూతన గ్రామ పంచాయతీలకు కార్యాలయ నిర్మాణాలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆయా గ్రామ సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరా జ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. మండలంలోని కొడిచర్ల తాండ, ఏనుగు మడుగుతాండ, మల్లాపూర్ తాండ, మక్తగూడలను నూతన గ్రామపంచాయతీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నూతన గ్రామపంచాయతీలు ఏర్పడిన నాటి ఆయా గ్రామ పంచాయతీలలో సరైన భవనం లేకపోవడంతో డ్వాక్రా భవ నాలు, ప్రభుత్వ పాఠశాలలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసు కొని పాలన కొనసాగిస్తున్నారు. మక్తగూడ, ఏనుగు మడు గు తండాలలో డ్వాక్రా భవనాలలో పరిపాలన కొనసా గుతుండగా కొడిచెర్ల తాండ, ఏనుగు మడుగు తాండ గ్రామపంచాయతీలలో ప్రాథమిక పాఠశాల భవనాలలో పాలన కొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం పంచాయతీ భవనాల నిర్మాణాలకు అనుమతి ఇవ్వడంతోపాటు నిధులు మంజూరు చేయడంతో సమస్య పరిష్కారం కానుంది. దీంతో సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డాం
గ్రామ పంచయతీకి భవ నం లేకపోవడంతో స్థానిక డ్వాక్రా భవనంలో పాలన కొన సాగిస్తున్నాం. ఇరుకైనా గదిలో పాలన కొనసాగించడం కష్టంగా మారింది. నూతన పంచాయతీ లకు భవనాలు మంజూరు చేయడం ద్వారా ఇకపై పాలన సజావుగా కొనసాగుతుంది. త్వరగా నిధులు మంజూరు చేసి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి. నిధుల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు.
- కాట్న రాజు, మక్తగూడ సర్పంచ్, కొత్తూరు మండలం.
గ్రామాలకు కొత్త శోభ రానుంది
గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో సమాజంలో మాకు గుర్తింపు లభించింది. నూతన పంచాయతీ ఏర్పడడంతో పరిపాలన కొనసాగిం చడానికి సరైన భవనం లేకపోవడంతో స్థానిక ప్రాథమిక పాఠశాల భవనంలో పరిపాలన కొనసాగిస్తున్నాం. సభలు, సమావేశాలు నిర్వహణ సమయంలో ఇబ్బందులు ఎదురవు తున్నాయి. నూ తన భవనాలకు నిధులు మంజూరు కావడం సంతోషకరంగా ఉంది. గిరిజన తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషకరంగా ఉంది. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారంతో తాండాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం.
- జరుపుల సంతోష్ నాయక్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు, కోడిచెర్ల తాండ గ్రామపంచాయతీ, కొత్తూరు మండలం.