Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం కట్టాలన్న రూ.151 కోట్లు రద్దు చేసే వరకూ పోరాడుతాం
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన కల్లాల నిర్మాణాలకు ఖర్చు చేసిన రూ.151 కోట్లు వెనక్కి ఇచ్చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతి రకిస్తూ చేవెళ్ళలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వ హించారు. ఈ ధర్నాకు స్థానిక ఎమ్మెల్యే కాలె యాద య్య బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉపాధి హామీ ద్వారా కల్లాల నిర్మించి, ఉపాధి కల్పిస్తే ఆ నిర్మాణాలకు ఖర్చు చేసిన రూ.151 కోట్ల రూపాయలు కేంద్రానికి కట్టా లంటున్నారని తెలిపారు. కేంద్రంలో ఎంతోమంది ప్రధానిలను చూశామని, తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూల్చేసిన ప్రధానిని ఇప్పుడే చూ స్తున్నామని అన్నారు. కర్ణాటక, మహా రాష్ట్రలో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వాటిపై ప్రధాని ఎందుకు మాట్లాడారని నిలదీ శారు. ఈడీ, సీబీఐ, ఐటీలను ఉసిగొల్పడమే తెలుసని ఎద్దేవ చేశారు. కేంద్రంలోని బీజేపీ సీఎం కేసీఆర్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా గుండె ధైర్యంతో ముందుకు వెళ్తున్నారని తెలి పారు. కేంద్రం కట్టాలన్న రూ.151 కోట్లు రద్దు చేసే వర కూ పోరాడుతామన్నారు.లేని యేడల రైతులంతా ఏకమై కేంద్రంపై తిరుగబడుతామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో చేవెళ్ల మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శేరి శివారెడ్డి, మండల ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు బక్కా రెడ్డి రవీందర్ రెడ్డి, బీిఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రభా కర్, సర్పంచులు మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.