Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు గ్రామాల్లో, తాండూర్‌లో సేవా కార్యక్రమాలు
నవతెలంగాణ-తాండూరు
నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం వెను కబడిన తరగతుల సంక్షేమానికి పోరాడే నాయకుడిగా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా వికారాబాద్ జిల్లా తాండూరులో బీసీ ఉద్యమ నేతగా పేరు పొందిన జాతీ య బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజవర్గ బీసీ సంఘం కన్వీనర్ రాజ్‌కుమార్ కందుకూరి జన్మదిన వేడుకలను శుక్రవారం మిత్రులు, యువకులు బీసీ సంఘం నాయకులు, మహిళా సంఘం నాయకుల ఆధ్వ ర్యంలో తాండూరులో పలు వార్డుల్లో, పెద్దేముల్, బషీరా బాద్ తాండూరు, యాలాల, మండలాల్లో రాజ్‌కు మార్ కందుకూరి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి, సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిం చారు. యువ కులు పెద్ద ఎత్తున రాజ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. యువకులు పలుచోట్ల రాజ్‌కుమార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. బషీరాబాద్ మండలం రెడ్డి ఘనపూర్‌లో మండలాధ్యక్షులు నరేందర్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యారు ్థలకు టైలు, బెల్ట్‌లు, పలకలు, ప్యాడు,్ల పంపిణీ చేశారు. లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణచారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వ హించారు. తాండూర్ పట్టణం టైలర్ రమేష్ అనిత ఆధ్వ ర్యంలో మహిళలకు చీరల పంపిణీ చేశారు రాజీవ్ కాలనీలో బీసీ మహిళా ఉపాధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో అంగన్వాడీ విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూర్‌లో ఎంపీటీఎల్ వద్ద అంగన్వాడీ కేంద్రంలో బీసీ మహిళా కార్యదర్శి మంజుల ఆధ్వర్యంలో అంగన్వాడీ విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూర్ మాత శిశు ఆస్పత్రిలో రాము ముదిరాజ్ గుంటు పల్లి వెంకట్ నేతృత్వంలో అల్పారం, భోజనం ఏర్పాటు చేశారు. కాళికా దేవి మందిరంలో తాండూర్ నియోజకవర్గ ముది రాజ్ సంఘం ఆధ్వర్యంలో రాజ్ కుమార్ ను గజమాలతో సన్మానం నిర్వహించి శాలువాలతో సత్కరించారు. కందేనెల్లిలో వికారాబాద్ జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్‌చారి ఆధ్వర్యంలో వృద్ధులకు చేతి కర్రలను పంపిణీ చేశారు. తాండూర్ నియోజకవర్గ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పుట్టిన రోజును వివిధ పార్టీలకు చెందిన నాయకులు కుల సంఘాల పెద్దలు యువజన సంఘ నాయకులు పూలమాలతో శాలువాలతో సత్కరించి అభి నందనలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ సాయిపుత్ర ఓమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత శంకర్ యాదవ్, బీసీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ సుకూర్, పట్లోళ్ల నర్సింలు, బాల్ రెడ్డి, మనోహర్, తాండూర్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్‌గౌడ్, డాక్టర్ సంపత్ కుమార్, శ్రీనివాస్‌చారి, అనిల్ బాండ్, రమేష్ టైలర్, రాము ముదిరాజ్, ముదిరాజ్ యువజన సంఘం తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్పి రవికాంత్, శ్రీకాంత్, బంటు మల్లప్ప, రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, సోషల్ మీడియా ఇన్చార్జ్ బసవరాజ్, అమ్రేష్, బసంత్ కుమార్, జగదీష్, వై వెంకట్, బోయ రాధాకృష్ణ, రజక నరసింహ, పాల్గొన్నారు.