Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షులు ఎస్బీ గుల్షన్
నవతెలంగాణ-కొడంగల్
ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల బోర్డులపై ఉర్దూ భాష లో పేర్లు రాయక పోవడం శోచనీయమని ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షులు ఎస్బీ గుల్షన్, మాజీ ఉపసర్పంచ్ ఎస్ఎం గౌసన్ అన్నారు. కొడంగల్ వివిధ పార్టీలకు చెందిన మైనార్టీ నాయకులు కార్యాలయాలపై పూర్తి భాషలో పేర్లు ఉండాలని రెవెన్యూ అధికారికి మెమోరండం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యాల యాలు, పాఠశాలలు, కళాశాలల పేర్లను తెలిపే బోర్డులపై రాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కొడంగల్ మున్సి పాలిటీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలపై వెంటనే ఉర్దూ భాషలో బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఉర్దూ భాషకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో అమలుకు నోచుకోవడం లేద న్నారు. ఇప్ప టికైనా ఉర్దూ భాషలో బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన, ధర్నా, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.