Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూని యర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్థులు నిరసనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీఎస్యూ జిల్లా ఉపా ధ్యక్షులు దీపక్ రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాల న్నారు. తాత్కాలికంగా మొబైల్ టాయిలెట్లను నియమిం చాలన్నారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరా టాలకు ప్రభుత్వం స్పందించి రూ.2 కోట్లు నిధులు కేటా యించడంపట్ల పీడీఎస్యూ విద్యార్థి సంఘం విప్లవ అభివందనాలు తెలిపారన్నారు. కళాశాలలో మూత్రశాల మరుగుదొడ్లు సరిగ్గా లేక నీటి సౌకర్యం లేక విద్యార్థినీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. త్వరలోనే పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున అధి కారులు చిత్తశుద్ధితో ఆలోచన చేసి వెంటనే తాతకాలిక మొ బైల్ టాయిలెట్లు నియమించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో భిక్షాటన చేసి మొబైల్ టాయిలెట్లు నియమిస్తామని వారు తెలిపారు. కార్యక్ర మంలో పీడీఎస్యూ నాయకులు శ్రీనివాస్ ప్రభుత్వ జూ నియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.