Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్, సర్పంచ్ హైమావతి రామస్వామి
నవతెలంగాణ-తలకొండపల్లి
తలకొండపల్లి మండలం గ్రామీణ ప్రాంతాల్లో క్రీడారంగాల్లో క్రీడాకారుల ప్రతిభ వెలికి తీయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం చెన్నంపల్లి గ్రామంలో సీపీఎల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్, ఇస్రాయిపల్లి గ్రామంలో వాలీబాల్ క్రీడాకారులకు కిట్లను అందజేశారు. మాదాయిపల్లిలో ఎంపీఎల్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌ను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సిఎల్ శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతో మాదాయిపల్లి నుంచి బొమ్మరాసిపల్లి వరకు రూ.5 లక్షలతో మట్టి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యువత క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సమాన దృష్టితో చూడాలని, గ్రామీణ యువత క్రీడల్లో రాణించి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాదాయిపల్లి సర్పంచ్ హైమావతి రామస్వామి,ఎంపీటీసీ అంబాజీ, వెల్జల్ ఉప్పసర్పంచ్ అజిజ్, నాయకులు గౌతరెడ్డి విజరుకుమార్ రెడ్డి, జంగయ్య, రాజుగుప్తా, మస్క వెంకటయ్య, రాజు, సురేష్ రెడ్డి, లాల్ కుమార్, శేఖర్ రెడ్డి, మల్లేష్, సుల్తాన్, శ్రీశైలం, శ్రీకాంత్ గౌడ్, రాజేందర్‌గౌడ్, రమేష్, రాఘవేందర్ క్రీడాకారులు యువకులు తదితరులు పాల్గొన్నారు.