Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ బాలరాజు, కమిషనర్ వీరేందర్,ఎంపీడీవో శరత్ చంద్రబాబు, తహసీల్దార్ రాములు
- నవతెలంగాణ-2023 కోర్టు క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-కొత్తూరు
ప్రజా సమస్యలు వెలికి తీయడంలో నవతెలంగాణ ఎల్లప్పుడూ ముందుంటుందని సీఐ బాలరాజు, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, ఎంపీడీవో శరత్ చంద్రబాబు, తహసీల్దార్ రాములు అన్నారు. నవతెలంగాణ-2023 కోర్టు క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమాజాభివృద్ధిలో నవతెలంగాణ పాత్ర ఎంతో కీలకమన్నారు. పత్రికలో ప్రచురితమయ్యే కథనాలు ప్రజలను చైతన్య పరిచే విధంగా చక్కటి భావజాలంతో సమాజాభివృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు. కార్మికుల సమస్యలను వెలికి తీసి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో నవ తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కార్మిక, కర్షక, నిరుపేదలు మహిళల పక్షాన నవతెలంగాణ ఎల్లప్పుడూ నిలబడుతోందని అభినందించారు.