Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తలకొండపల్లి
ఎస్ఐ,కానిస్టేబుల్ ఉచిత శిక్షణ శిబిరంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ దిల్సుక్నగర్ లో తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ తన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, రాజశేఖర్ ఐరైస్ అకాడమీ, నందు ఆర్మీ అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణా కేంద్రం ప్రారంభించారు. ఈ శిబిరంలో 1200 మంది శిక్షణ తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, నందు నాయక్, రాజశేఖర్, ఎంపీపీ తిరమణి నిర్మల, సర్పంచ్ గోపాల్ నాయక్, హనుమాన్ నాయక్, నాయకులు తావుర్యా నాయక్, విజేందర్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.