Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ మహేంద్ర కుమార్ రెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
లయన్స్ క్లబ్ ఆఫ్ కందుకూరు ఆధ్వర్యంలో వాడుకలో లేని ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువుల సేకరణ కార్యక్రమాన్ని లయన్స్ జిల్లా మార్కెటింగ్ చైర్పర్సన్, డా.జి మహేంద్రకుమార్‌రెడ్డి, స్థానిక భూలక్ష్మి ఆస్పత్రిలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవనాన్ని సరళతరం చేసిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆ సాంకేతికత తెచ్చే ముప్పునకు అనివార్యంగా గురి కావలసి వస్తుందన్నారు. అలాంటి ఒక ఉపద్రవం నిరుపయోగమైన ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి ఉపకరణాల వలన వస్తున్నదన్నారు. మన రోజువారీ జీవితంలో విడదీయరాని సంబంధం ఉన్న సెల్ ఫోన్ నుంచి వంటింట్లో వాడే ఎలక్ట్రిక్ కుక్కర్ దగ్గర నుంచి, అన్ని ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ ప్రతీ పనికిరాని వస్తు వులను ఈ-వేస్ట్ అంటాం.కానీ మన దేశం ఈ ఈ-వేస్ట్ సృష్టిస్తున్న మూడోవ అతి పెద్ద దేశంగా ఉందన్నారు. ఈ ఈవేస్ట్ పర్యావరణానికి , మానవ ఆరోగ్యానికి చాలా ముప్పు కలిగిస్తున్నదని వివరించారు. ఈవేస్ట్‌ను సరైన పద్ధతిలో సేకరించి, రీసైకిల్ చేస్తే రెండు లాభాలు న్నాయనీ, ఒకటి పర్యావరణ పరిరక్షణకు , రెండు రీసైకిల్ చేసిన తరువాత వాటిని పేద ప్రజలకు అందుబాటులో తెస్తే డిజిటల్ లెర్నింగ్ అవసరాలు తీర్చడానికి వీలవుతుందని తెలిపారు.ఈ వేస్ట్‌ను సేకరించే బృహత్తర కార్యక్రమాన్ని, లయన్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకూ చేపడుతున్నట్టు తెలిపారు. మండల ప్రజలందరూ నిరూపయోగంగా ఉన్న వస్తువులన్నీ ఇస్తే, వారి పేరుపై ఒక మొక్క నాటనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్పర్సన్, క్లబ్ కార్యదర్శి, పీఏసీఎసీఎస్ డైరెక్టర్ తీగెల జగదీశ్వర్‌రెడ్డి, నిమ్మఅంజిరెడ్డి అన్నారు.