Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీపీ ఉమామహేశ్వరరావు
నవతెలంగాణ-కందుకూరు
యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమా మహేశ్వరరావు అన్నారు. శుక్రవారం టంకరి రాంరెడ్డి కల్యాణ మండపంలో కందు కూరు సీఐ కృష్ణంరాజు ఆధ్వర్యంలో 'నేను సైతం' అవగా హనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై, ఆయన మాట్లాడుతూ విద్యా ర్థులు చదువుతోపాటు అభివృద్ధిపై దృష్టి సాధించా లన్నారు. మత్తు పదార్థాలకు, పేకాటకు బానిసలు అయితే కుటుంబ సభ్యులతో పాటు ,ఈ సమాజంలో చిన్నచూపు చూస్తారన్నారు. మత్తు విడువకపోతే జీవితం నాశనం అవు తుందన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదవడం కుటుంబం కోసం బతకడం నేర్చుకోవాలని సూచించారు. 'మన జీవితం ఒక తెల్ల కాగితంవంటిందనీ ఏది రాస్తే అదే పడినట్టు మన మంచి ఆలోచనలతో ముందుకు సాగేలా కృష చేయాలని చెప్పారు.ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించి, బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని కోరారు. అనంతరం ఎల్బీనగర్ సీఐ నాగమల్లి మాట్లా డుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మద్యం తాగి వాహనాలు నడపవద్దని కోరారు. మత్తు ఒక చెడు అలవాటని అన్నారు. బైక్‌పై ప్రయాణించే వారు తప్పనిసరి నాణ్యమైన హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు మార్గాలు ఇరుకుగా ఉన్నప్పుడు కొద్దిసేపు వాహ నాలు ఆపుకోవాలని తెలిపారు. వాహన దారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, సురక్షితంగా వారివారి గమ్యాలకు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సెఫీన్ హుస్సేన్ తన స్పీచ్‌తో విద్యార్థులను ఆకట్టుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితం బాగుపడాలని, దేశం కోసం పనిచేయాలని యువతకు పిలుపునిచ్చారు. అనం తరం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువజన సంఘాలకు క్రికెట్ కిట్టు, వాలీబాల్ కిట్టు కందుకూరు సిఐ కష్ణంరాజు అందజేశారు. ఈ కార్యక్రమంల సీఐ జోసెఫ్, ఎస్సైలు శ్రావణ్, కొండల్, నరేష్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు , వివిధ గ్రామాల యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.