Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తూరు ఎంపీపీ పిన్నింటి మధుసూదన్‌రెడ్డి
నవతెలంగాణ-కొత్తూరు
గ్రామపంచాయతీలలో సర్పంచులు తగిన ప్రణాళిక రూపొందించుకుని గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కొత్తూరు ఎంపీపీ పిన్నిటి మధు సూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాల యంలో గ్రామ పంచా యతీ అభివృద్ధి ప్రణాళిక పట్ల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లకు, ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లా డారు.. గ్రామపంచాయతీలలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా మెలిగి అభివృద్ధికి తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రతినిధుల పదవీకాలం ఒక ఏడాది పాటే ఉందని ఇకనుంచి ప్రజలతో మమేకమై అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల న్నారు. గ్రామాల అభివృ ద్ధికి అధికారుల పూర్తి సహకారం అందిస్తున్నారని ఆయన వారిని అభినం దించారు. అంతకుముందు అధికారులు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు వాటి వినియోగం విధి విధా నాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాములు, ఎంపీడీవో శరత్ చంద్రబాబు, ఎంపీఓ నర సింహ, సర్పంచులు అంబటి ప్రభాకర్, వడ్డే తులసమ్మ బాల య్య, రవినాయక్, వెంకట్‌రెడ్డి, అజరు నాయక్, ఎంపీటీసీ దేశాల అంజమ్మ, నాయకులు లింగం నాయక్, శ్రీరాములు యాదవ్, గణేష్, అధికారులు మండల వ్యవసాయ అధికారి గోపాల్, మండల విద్యుత్ ఏఈ సాయి కృష్ణ, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.