Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్పల్లి
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి 67వ పుట్టినరోజు వేడుకలను బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో ఆదివారం కేక్‌కట్ చేసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మర్పల్లి మం డల బీఎస్పీ అధ్యక్షులు పర్యవేద శ్రీనివాస్ మాట్లాడు తూ బహుజనులకు రాజకీయ చైతన్యం రావాలని రా జ్యాధికారం దిశగా కృషి చేశారన్నారు. విద్యా, వైద్యం ఉచి తంగా అందించాలని, నిరుపేదలకు భూములు ఇవ్వాలని ప్రభుత్వ అసైన్మెంట్ భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ కోకన్వీనర్ సయ్యద్ అమీర్, మండల్ ప్రధాన కార్యదర్శి కావలి ప్రభాకర్, శ్రీకాంత్, సెక్టర్ అధ్యక్షులు మ స్తాన్, సజ్జత్ మక్బుల్, అరవింద్, చిన్న తదితరులు పాల్గొన్నారు.