Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధశాఖల ఉన్నత అధికారులతో 'కంటివెలుగు' పథకంపై సమీక్షా సమావేశం నిర్వహిం చారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రతిష్టాత్మకమైన 'కంటివె లుగు' పథకం ద్వారా కంటి సమస్యన్న ప్రతి పౌరునికీ ఉ చితంగా అద్దాలు సమకూరుస్తారని, సర్జరీలు, ఇతర చికిత్స లను ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు. సాధారణ కంటి వ్యాధులకు మందులను సమకూర్చి, హానికరమైన కంటి వ్యాధుల నివారణపై నియో జకవర్గంలోని ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు. క్యాంపుల నిర్వహణకు పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు చేయాలని అధికా రులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధి కా రి డాక్టర్ శివరాజ్, మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర, డీఎల్పిఓ అనిత, డిప్యూటీ డీఆర్డీఓ, వికారాబాద్ నియోజ కవర్గంలోని తహసీల్దారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీఎం, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.