Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నర్కూడ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ దివ్యశ్రీ
- జనవరి 18 నుంచి జూన్ 27 వరకూ 'కంటివెలుగు'
నవతెలంగాణ-శంషాబాద్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా జనవరి 18 నుంచి జూన్ 27 వరకూ శంషాబాద్ మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో రెండో విడత 'కంటివెలుగు' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నర్కూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దివ్యశ్రీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే 'కంటివెలుగు' కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికే ఇప్పటికే మండలస్థాయిలో మున్సిపాలిటీలో అవగాహనా సదస్సులు నిర్వహించామన్నారు. ఈ నెల 18 న మండల పరిధిలోని చౌదర్‌గూడ, రషీద్‌గూడ గ్రా మాల్లో 'కంటివెలుగు' కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. చౌదర్‌గూడ (5) రషీద్గూ డలో (3) రోజులు 'కంటి వెలుగు' కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మండలంలో పాలమా కుల 22 రోజులు, నర్కూడ 12, పెద్ద షాపూర్లో 12 రోజులు, పెద్ద తూప్ర 8 రోజుల 'కంటివెలుగు' కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అత్యల్పంగా రషీద్‌గూడ, అల్లికోల్ తండా, పిల్లోని గూడ, పెద్ద తూప్ర తండా గ్రామాల్లో మూడు రోజుల పా టు 'కంటి వెలుగు' కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మి గతా పంచాయతీలో ఆయా జనాభా సామర్థ్యాన్ని బట్టి 7 నుంచి 4 రోజుల పాటు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరం ఉన్నవారికి కళ్లద్దాలు, కంటి ఆపరేషన్లు, మందులు అందింస్తామన్నారు.