Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చౌదర్‌గూడ సర్పంచ్ కటికల రాజ్‌కుమార్
నవతెలంగాణ-శంషాబాద్
గ్రామంలోని ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని మండల పరిధి లోని చౌదర్‌గూడ సర్పంచ్ కటికల రాజకుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన రెండో విడత 'కంటివెలుగు' కార్యక్రమం చౌదర్ గూడ గ్రామం లో ఈ నెల 18 ప్రారంభమవు తుందని తెలిపారు. అందుకు తగి న ఏర్పాట్లను చేస్తామన్నారు. జ్ఞానేంద్రియాల్లో కండ్లు అతి ముఖ్యమైనవని వాటిపట్ల ప్రజలకు నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. ఐదు రోజులపాటు గ్రామంలో నిర్వహిం చే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయిం చుకోవాలని కోరారు.