Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రిన్సిపల్ పి.అపర్ణ
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యం లో నిర్వహించబడుతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, వికారాబాద్ (సీఓఈ)లో 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ అడ్మిషన్స్‌కు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కొత్తగడి వికారాబాద్ ప్రిన్సిపల్ పి.అపర్ణ తెలిపారు. సీఓఈలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడుతూ సంక్షేమ గురుకులాల సంస్థ సీఓఈ సెట్ 2023-24కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. జనవరి 12 నుంచి జనవరి 31 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చ్ 5వ తారీఖు (ఆది వారం) ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. వికారాబాద్ సీఓఈ కళాశాలలో ఎంపీసీలో 40 సీట్లు, బైపీసీలో 40 సీట్లు కలవు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో అడ్మిషన్ పొం దిన వారికి అకాడమిక్ బోధనతోపాటు ఐఐటీ, నీట్ పరీక్ష లకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. అభ్య ర్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవావలసి ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా సీ ట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు.
టీఎస్ డబ్ల్యూ ఆర్సీఓఈ సెట్ 2023 వివరాలు :-
పరీక్షని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్న పత్రాన్ని ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. ఇందులో మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఎంపీసీ ప్రవేశ పరీక్షలో ఇంగ్లీష్ నుంచి 20, మ్యాథమాటిక్స్ నుంచి 60, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. బైపీసీ ప్రవేశ పరీక్షలో ఇంగ్లీష్ నుంచి 20, మాథ్స్ నుంచి 20, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్‌ల నుంచి ఒక్కో దానిలో 40 ప్రశ్నలు ఇస్తారు. 8వ తరగతి నుంచి 10 తరగతి వరకూ నిర్దేశించిన సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సమాధానాలను ఓఎంఆర్ పత్రం మీద గుర్తించాలి. ప్రశ్న కు 1 మార్కు చొప్పున మొత్తం మార్కులు 160. ఋణాత్మక మార్కులు ఉన్నాయి. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే పావ ుమార్క్ కోత విధిస్తారు. రాష్ట్రస్థాయిలో సాధించిన మెరిట్ ఆధారంగా అడ్మిషన్స్ ఉంటాయి.
రిజర్వేషన్ :-
ఎస్సీ అభ్యర్థులకు 75 శాతం, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టి యన్లకు 2 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 6 శాతం, బీసీ అభ్య ర్థులకు 12 శాతం, మైనార్టీ అభ్యర్థులకు 3 శాతం, జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 2 శాతం సీట్లు నిర్దేశించారు.
అర్హత :-
ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసీఎస్ఈ, సీబీ ఎస్ఈ విద్యార్థులు కూడా అర్హులే. మొదటి అటెంప్ట్ లోనే పదో తరగతి పాస్ అవ్వాలి. అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 31 నాటికి 17 ఏండ్లలోపు ఉండాలి. ఎస్సీ అభ్యర్థు లు, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లకు రెండేళ్ల మినహాయింపు వర్తిస్తుంది. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1,50,000 నగరాల్లో రూ.2,00,000 మించ కూడదు.
ముఖ్య సమాచారం :-
రిజర్వేషన్ ఫీజు రూ. 100, ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 31, హాల్ టికెట్ డౌన్లోడింగ్ -ఫిబ్రవరి 20 నుంచి మార్చి 4 వరకు, టీఎస్ డబ్ల్యూ ఆర్సీఓఈ సెట్ 2023 తేదీ మార్చి 5 tsswreisjc.cgg.gov.in