Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంషాబాద్ మున్సిపల్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చేవెళ్ల ప్రసాద్
నవతెలంగాణ-శంషాబాద్
ఈ నెల 18న ఖమ్మంలో జరగబోయే మొదటి బీఆర్ఎస్ మహాసభ విజయ వంతం చేయాలని శంషాబాద్ మున్సిపల్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చేవెళ్ల ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన శంషాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ దేశ భవిష్యత్తును మార్చేందుకు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్పు చేశారన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరుగుతున్న అభివద్ధి కార్యక్ర మాలు దేశమంతా వర్తింపజేసేందుకు బీఆర్ఎస్ను ఏర్పా టు చేశారన్నారు. దేశ్ కి నేతగా రైతు సమస్యలు తెలిసిన సీఎంగా అపార అనుభవమున్న కేసీఆర్‌తోనే దేశ భవి ష్యత్తు మార్చే అవకాశముందన్నారు. దేశంలో బీజేపీ అరా చక పాలనను నిలువరించి సుపరిపాలన అందించడంతో పాటు రైతు సంక్షేమం దిశగా అడుగులు వేయడానికి ఆయన జాతీయ రాజకీ యాల్లో అడుగుపెట్టా రన్నారు. రైతుల కోసం రైతు బీమా, రైతుబంధు, మిషన్ కాకతీయ వంటి పలు అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టి దేశం దృష్టిని ఆకర్షిం చాలన్నారు. దీంతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి నమూనాను దేశమంతటా చేసి చూపించాలని ఉద్దేశంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారన్నారు అందుకు ఖమ్మం మహాసభ వేదిక కానుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు రైతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.