Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ హమీద్ పటేల్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వివినియోగించుకోవాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు.గురువారం కొండా పూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్లోని సగర సంఘం కార్యాల యంలో, కొత్తగూడ కమ్యూనిటీ హాలు నందు ఏర్పాటు చేసిన కంటివెలుగు కార్యక్రమ శిబిరాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమంలో సుమారు 1500 మంది వైద్య బృం దాలు, 30 లక్షలు రీడింగ్ గ్లాసెస్లు, 25 లక్షలు ప్రిస్కెప్షన్ గ్లాసెస్లతో, 100 రోజుల బాటు సుదీర్ఘంగా భారీ ఎత్తున కంటివెలుగు కార్యక్రమం చేపట్టటం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో కంటివెలుగు మెడికల్ ఆఫీసర్ డా.జోష్నా, డీఈఓ బి. నరసింహులు, బీఆర్ఎస్ నాయ కులు నరసింహ సాగర్, రక్తపు జంగం గౌడ్, తిపర్తి రఘు, రూప రడ్డి, రవిశంకర్నాయక్, శ్రీనివాస్ గౌడ్, రామకృష్ణ, హీనాయత్, మధు ముదిరాజ్, నీలం లక్ష్మి నారాయణ, నీలం రాము, కేశం కుమార్, నీలం వెంకటేష్, దీపక్, ఉప్పులూరి ఆనంద్ సాయి శామ్యూల్ కుమార్, నీలం లక్షణ్, మొహ్మద్ ఖాసీం, సాయి బాబు, రవీందర్ రెడ్డి, ఎండి అబ్దుల్ కరీం, సాయి బాబు, జహంగీర్, మధు, రాజు, శ్రీనివాస్, జగదీష్, నర్సింగ్, పుణ్యవతి, రఫియా బేగం, సునీత తదితరులు పాల్గొన్నారు.