Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
- కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం
నవతెలంగాణ-పెద్దేముల్
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల దేశ నాయకులు జేజేలు కొడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. గురువారం పెద్దేముల్ మండల పరిధిలోని ఆత్కూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం సొసైటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, గ్రామ సర్పంచ్ సువర్ణలతో కలిసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమోద్ కుమార్, మారేపల్లి సర్పంచ్ బల్వంత్ రెడ్డి, మంబాపూర్ ఎంపీటీసీ శ్రీనివాస్, సర్పంచ్లు ప్రభాకర్, ప్రకాశం, మొగు లప్ప, మాజీ మండల అధ్యక్షులు డివై.నర్సింలు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.