Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ కొప్పు సుకన్యభాష
- జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య
- యాచారం, చిన్న తుండ్లల్లో 'కంటి వెలుగు' ప్రారంభం
నవతెలంగాణ-యాచారం
తెలంగాణలో అంధత్వ రహిత రాష్ట్రమే లక్ష్యమని ఎంపీపీ కొప్పు సుకన్య భాష, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని యాచారం, చిన్నతుండ్లల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని వారు ప్రారంబించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. గ్రామాల్లో కంటి సమస్యతో బాధపడుతున్న వారందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి పరీక్షలు, కండ్ల అద్దాలు పంపిణీ చేసి, సంబంధించిన మందులను అందజేస్తారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుచరిత, ఎంపీడీవో విజయలక్ష్మి, స్పెషల్ ఆఫీసర్ జంగారెడ్డి, సీఐ లింగయ్య, ఎస్ఐఐలు ప్రసాద్, వెంకటనారాయణ, సర్పంచులు శ్రీధర్‌రెడ్డి, సబిత, పంచాయతీ కార్యదర్శులు, వైద్యులు, సూపర్వైజర్, ఏఎన్ఎమ్స్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.