Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం
- మారెపల్లితండాకు రూ. 50 లక్షలు నిధులు
- కంటి వెలుగు దేశానికి ఆదర్శం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-పెద్దేముల్
మహిళలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తే, దేశ చరిత్రను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మారుస్తారని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం పెద్దేముల్ మండల పరిధిలోని మారేపల్లితండా గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయం శాఖ చైర్మెన్ రాజుగౌడ్, పెద్దేముల్ జడ్పీటీసీ ధారాసింగ్, ఎంపీపీ అనురాధ రమేష్, గ్రామ సర్పంచ్ పాండునాయక్, ఎంపీటీసీ స్వప్న, రాష్ట్ర ఎంపీటీసీల పోరం సంఘం ఉపాధ్యక్షులు వెంకటేష్ చారి, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మెన్ ఉప్పరి మహేందర్, మండల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పవిత్ర, మండల్ కంటి వెలుగు స్పెషల్ ఆఫీసర్ లలిత కుమారి, కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద ప్రజలందరూ కంటి వెలుగు సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పట్ల ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాల మంత్రులు అభినందనలు తెలిపినట్టు వెల్లడించారు. ఉచితంగా మందులు కంటి అద్దాలతో పాటు కంటి ఆపరేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందన్నారు. మారేపల్లితండాకు రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పెద్దేముల్ మండలంలోని మారేపల్లితండాను సమస్యలు లేని తండాగా తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు. అనంతరం కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు నిర్వహించుకున్న మహిళలకు అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మయ్య, తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి, ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ బుచ్చిబాబు, పెద్దే ముల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు జనార్ధన్ రెడ్డి, సర్పంచులు చంద్రయ్య, శ్రావణ్ కుమార్, మండల ఎంపీటీసీల ఫోరం సంఘం అధ్యక్షులు ధన్సింగ్, యూపీ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ కుమార్, అంగన్వాడీ సూపర్వైజర్ రాణి, ఆర్ఐ రాజిరెడ్డి, ఎంపీఓ సుష్మ, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సంగమేశ్వర్, మాజీ సర్పంచులు రమేష్ యాదవ్, రవీందర్ నాయక్, సంతోష్ నాయక్, బీఆర్ఎస్ మాజీ నారాయణ రెడ్డి, మాజీ ఎంపీ టీసీ కొమ్ము గోపాల్‌రెడ్డి, విష్ణు, వెంకటేశం వివిధ శాఖల అధికారులు, ఆస్పత్రి సిబ్బంది,గ్రామస్తులు, పాల్గొన్నారు.