Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ-దారుర్
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారం భించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు కార్యమ్రకంలో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించిన తర్వాత వారివారి ఆధార్ కార్డు లింక్‌తో, కండ్ల అద్దాలు వారికే బార్కోడ్లతో అందజేయనున్నట్టు తెలిపారు.ఈ కార్య క్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జడ్పీటీసీ సుజాత వేణుగోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతి నిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.