Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
- మొద్దు నిద్రలో ఇరిగేషన్ అధికారులు
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం
- టీఎంకెఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోరింకల నరసింహ
- ఎఫ్టిఎల్ లోపట మట్టి పోయడంపై నిరసన
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని మేడిపల్లి ఎక్వ చెరువులో మట్టి పోసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీఎంకెఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోరింకల నరసింహ డిమాండ్ చేశారు. గురువారం మేడిపల్లి ఎక్వ చెరువులో ఎఫ్టిఎల్ లోపట మట్టి పోయడంపై మత్స్య కార్మిక సంఘం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులో ఉన్న ఎఫ్టీ ఎల్ హద్దు రాళ్ల పక్కనే ఉన్న ఎరుకలి బాల్‌రాజ్‌గౌడ్ ట్రాక్టర్లతో మట్టి నింపడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆయనపై అధికారులు చట్టాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువులోకి వర్షపు నీరు రాకుండా మట్టితో పూడ్చడాన్ని ఖండిస్తున్నామన్నారు. వెంటనే చెరువు కుంటలు శాటిలైట్ ద్వారా రీ సర్వే చేసి ఎఫ్టిఎల్ ఆదురాళ్ళు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో రియల్ ఎస్టేట్, ప్రయివేటీకరణ, పరిశ్రమల పేరుతో పెద్ద ఎత్తున చెరువులు కబ్జా గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పై అధికారులకు ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు. మేడిపల్లి ఎక్వ చెరువులో మట్టి పోసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య సొసైటీ అధ్యక్షుడు గోదాసు నరసింహ, కార్యదర్శి కానమొని గణేష్, సభ్యులు గోదాసు కేశవులు, ఎస్ దశరథ తదితరులు పాల్గొన్నారు.