Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు
- అవసరమైన వారికి వెంటనే అద్దాలు పంపిణీ
- కంటి వెలుగు క్యాంప్‌ను
- ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నిఖిల,పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్‌రెడ్డి
నవతెలంగాణ పూడూర్
ప్రజా సంక్షేమ బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండల పరిధిలోని చంగముల్ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిఖిల ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కంటి వెలుగు ప్రతీ గ్రామంలో ప్రజలందరూ కంటి పరీక్షలు నిర్వహించుకుని అవసరమైన వారికి వెంటనే అద్దాలు అందించే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలను గుర్తించి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించుకునే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. వైద్యుల సూచనల మేరకు కంటి అద్దాలు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మలిపెద్ది మేఘమాల ప్రభాకర్‌గుప్తా, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి సుధారాణి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మైపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు అజీముద్దీన్, పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ ఎండీ అజారుద్దీన్, వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు అనంతరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.