Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. ఆదివారం కందుకూరు మండల్ రాచులూరు గ్రామానికి జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ.నాలుగు లక్షలు సీసీరోడ్ల నిర్మాణం కోసం ప్రొసీ డింగ్‌ను బీఆర్ఎస్ నాయకులు గుయ్యని సామయ్యకు అం దజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నా యని అన్నారు. నియోజకవర్గంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపారు. కందుకూరు మండలంలో అన్నిగ్రామాలలో అభివృద్ధి పను లు కొనసాగించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకత చాటుకున్నారన్నా రు. దేశంలో అభివృద్ధి విషయంలో రాష్ట్రం ముందుకు దూసుకెళ్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్‌రెడ్డి, నాయకులు ప్రశాంత్ చారి, పాల్గొన్నారు.