Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ మండల అధ్యక్షులు మహేశ్వరం గోవర్దనాచారి, మాజీ వైస్ ఎంపీపీ దన్నే భాషయ్య
నవతెలంగాణ-మంచాల
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసు కెళ్ళి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయా లని బీజేపీ మండల అద్యక్షులు మహేశ్వరం గోవర్దనాచారి, మాజీ వైస్ ఎంపీపీ దన్నే భాషయ్యలు పార్టీ శ్రేణులకు పిలు పునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని చిత్తాపుర్ గ్రా మంలో బీజేపీ భూత్ అద్యక్షులు సూరేపల్లి శ్రీనివాస్, గండి కోట యాదగిరి అధ్యక్షతన బీజేపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, ప్ర భుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికీ తెలపాలని అన్నారు. కార్యక్ర మంలో మండల ఉపాధ్యక్షులు నార్ల కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు జీ.సత్తిరెడ్డి, ఎస్.పోచయ్య, డి.కిష్టయ్య, ఎన్.రాములు, ఆర్.జంగయ్య, ఆర్.లక్ష్మయ్య, జీ.కిష్టయ్య, ఎన్.కృష్ణ, జీ.వెంకటేష్, ఎస్ఎంసీ చైర్మన్ సిఎచ్.కృష్ణ ఉన్నారు.