Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాడిగల్ల ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ- శంకర్పల్లి
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 30న మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపట్టనున్న అనాథల అరిగోస మహాదీక్ష కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ శంకరపల్లి మండలం ఇన్చార్జ్ కాడిగల్ల ప్రవీణ్‌కుమార్ మాదిగ అన్నారు. ఆదివారం స్థానిక అతిథిగృహంలో ఎమ్మార్పీఎస్ ఏర్పాటు చేసిన సమావే శంలో మాట్లాడుతూ అనాథలకు అండగా ప్రభుత్వం ఉందని చెప్పిన సీఎం కేసీఆర్ మాయమాటలు చెప్పి ఏడేండ్ల్లు అవుతుందన్నారు. మంత్రివర్గ ఉప సంఘం ద్వారా సిఫారసులు చేసి అనాథలకు స్మార్ట్ ఐడీ కార్డులు ప్రతి జిల్లాలో ఆశ్రమం 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి నేటికి నెరవేర్చకుండా అనాథలను సైతం మోసం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఆసిగల్ల గండయ్య, శ్రీనివాస్, శివ శంకర్, జనార్ధన్, గణేష్, లక్ష్మయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.