Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తలకొండపల్లి
తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో శ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి సన్నిధిలో ఆదివారం నిర్వహించిన బండ లాగుడు పోటీలు ఎద్దుల బండి పోటీలు అత్యంత వైభవంగా కొనసాగాయి. మొత్తం ఏడు ఎద్దుల జంటలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. మొదటి స్థానంలో కడారి వెంకటయ్య ఎద్దులు 1835 ఫీట్లు లాగి రూ. 15వేలు బహుమతి అందుకున్నారు. ద్వితీయ బహుమతి నల్ల జంగయ్య ఎద్దులు 1800 ఫీట్లు లాగడంతో రూ. పది వేలు, తృతీయ బహుమతి గోసుల కృష్ణయ్య 1500 ఫీట్లు లాగడంతో రూ.ఐదు వేల బహుమతులు అందజేశారు. అలాగే బ్రహ్మౌత్సవాల సందర్భంగా మధ్యాహ్నం సత్యనా రాయణ స్వామి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ దాసరి కిష్టమ్మ, తలకొండపల్లి సర్పంచ్ లలిత జోతయ్య, ఉప సర్పంచ్ జక్కు శ్రీనివా స్‌రెడ్డి, ఖానాపూర్ ఎంపీటీసీ సరితగ ణేష్గుప్తా, మాజీ ఎంపీటీసీ యాదయ్య, ఆలయ నిర్వాహకులు రంగారెడ్డి, కే.చంద్రకుమార్, తిరుపతిరెడ్డి, భాస్క ర్‌రెడ్డి, కాలూరి ఆనంద్, నరసింహ, శ్రీ ను, ప్రకాష్, రమేష్, కడారి యాదయ్య, భీష్మాచారి, బైకని రాములు, మల్లారెడ్డి, రాకేష్, మల్లేశ్, శ్రీను, ఫౌండర్ ట్రస్టు ముకురాల వెంకటేశ్వర శర్మ, పూజారులు ఆంజనేయ శర్మ, శ్యాం సుందర్ శర్మ, రామ శంకర శర్మ, సుధాకర్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.