Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ గిరి
నవతెలంగాణ - కుల్కచర్ల
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని కు ల్కచర్ల ఎస్ఐ గిరి అన్నారు. అన్ని రకాల వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌ను తప్ప నిసరిగా పాటించాలని, అజాగ్రత్తతో వాహనాలను నడిపి ప్రాణాలను కోల్పో యి తమపై ఆధారపడ్డ కుటుంబాలను అనాథ చేయొద్దని సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికీ ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో వాహనానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, నంబర్ ప్లేట్ కూడా అంతే ముఖ్యమ న్నారు. వాహనాలను ట్రాఫిక్ చట్టాల లోబడి మాత్రమే వాహనాలను నడిపించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సీటు బెల్ట్ ధరించి వాహనం నడుపాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లా డుతూ.. మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదని, ద్విచక్రవా హనంపై ముగ్గురు ప్రయాణించరాదని, రాంగ్ రూట్లో వాహనాలు నడుపవద్దని సూచిం చారు. మైనర్లకు వాహనాలను ఇచ్చి ప్రోత్సహిస్తున్న తల్లిదం డ్రులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తప్పనిసరిగా వాహనాల రిజిస్ట్రేష న్ పత్రాలతో పాటు ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ పత్రాలు వాహనాలో అందుబాటులో ఉండా లన్నారు. ప్రమాదాలు జరిగినాక బాధపడకుండా, ప్రతి ఒక్కరూ వాహనాలను ట్రాఫిక్ రూల్స్ ప్రకారం నడిపి తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కాపాడాలని సూచించారు. వాహ న చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చట్టాలకు లోబడి వాహనాల నడపాలన్నారు. ప్రతి సంవత్సరం వాహన ప్రమాదాలు అంతకంతకు పెరుగుతున్నాయని తెలిపారు. వీటి నివారణకు కృషి చేయాలన్నారు.