Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలతో కాలం వెలదీస్తుందని చేవెళ్ల బీజేపీ మండల అధ్యక్షులు పాండు రంగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డిలు అన్నారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా మండల అధ్యక్షులు అర్రపల్లి అశోక్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులుగా చేవెళ్ల మండల అధ్య క్షులు దేవర పాండురంగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ అడుగులు గడప దాటట్లేదు అనే సామెత కెసీర్ పాలనకు సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ దళితుల అభివృద్ధే లక్ష్యమని మాయ మాటలతో పబ్బం గడుపుతు న్నదన్నారు. భూమి ఇస్తానని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని, దళిత బంధు కూడా ప్రతీ దళిత కుటుంబానికి ఇస్తానని డాంబీకాలు కొట్టిన బీఆర్ఎస్ దానికి భిన్నంగా పాలన కొనసాగిస్తున్నదన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో కనీసం 1000 మంది దళితులకు కూడా ఇండ్లు, భూమి ఇవ్వని బీఅర్ఎస్ సిగ్గుతో తలదించుకోవలన్నారు. ఇకనైనా సోయికచ్చి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని అర్హులైన దళి తులందరికీ ఇండ్లు, భూమి, దళితబందు తక్షణమే ఇవ్వా లని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారని సూచించారు. అలాగే పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే వాటిపై వివరించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల బీజేవైఎం టౌన్ అధ్యక్షులు బండారి శేఖర్‌రెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు వెంకట్‌రెడ్డి, బీజేవైఎం జాయింట్ సెక్రెటరీ బాల్‌రెడ్డి, దళిత మోర్చా మండల కమిటీ సభ్యులు పాలమాకుల రవీందర్, కుమార్, వెంకటేష్, సాయి, రమేష్, అనిల్, నవీన్, రామకృష్ణ, మల్లేష్, ప్రభాకర్, తదితరులు ఉన్నారు.