Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేను కోరిన అంగన్వాడీలు
నవతెలంగాణ-గండిపేట్
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని అం గన్వాడీలు డిమాండ్ చేశారు. ఆదివారం అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి కవిత ఆధ్వర్యంలో గండి పేట, రాజేంద్రనగర్‌కు చెందిన అంగన్వాడీలు రాజేం ద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను కలిశారు. తమ సమ స్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. అలాగే తమ సమస్య లపై రాబోయే బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడాలని ఎమ్మె ల్యేను కోరారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లా డుతూ 40ఏండ్లుగా ఐసీడీఎస్‌లో వెట్టిచాకిరి చేస్తున్నామని అన్నారు. గతంలో తమకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కనీసం సమావేశాలు నిర్వహించుకోవడానికి సొంత భవనాలు లేవ న్నారు. ఇతర రాష్ట్రాలు కల్పిస్తున్నట్టు రాష్ట్రంలో బెనిఫిట్స్ రావడం లేదన్నారు. పెంచిన వేతనాలు అమలు కావడం లేదన్నారు. అంగన్వాడీల ఖాళీలను భర్తీ చేయాలని డి మాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. తమ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్య క్రమంలో సీఐటీయూ కన్వీనర్ రుద్రకుమార్, యూనియన్ అధ్యక్షురాలు సుధారాణి, కార్యదర్శి మీనా, గండిపేట్ యూ నియన్ నాయకురాలు జ్యోతి, సుకన్య, విజయ, రాణి, అన్నపూర్ణ, షీలాలావతి. ఇందిరా, రాణి, చంద్రకళ, మీనా, బాలలక్ష్మీ శ్రీలలిత, ప్రణిత, ఉషారాణి, సరిత, నిర్మల, సావిత్రి, మంజుల, ప్రసన్న సంగమ్మ, లీలా, రాణి, శోభా, అన్నపూర్ణ, నలిని, తదితరులు పాల్గొన్నారు.