Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్
నవతెలంగాణ-కేశంపేట
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మె ల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో కేశం పేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన కాం గ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా ప్రజల ఆకాం క్షలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నామని తెలిపా రు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతు న్నామని చెప్పారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. అబ్బి సుందరయ్య (ఉప సర్పంచ్), జంగయ్య, కుక్కల ఆంజనేయులు, జనార్దన్, బాలరాజు, శ్రీశైలం, వినోద్, జంగయ్య, కిష్టయ్య, జయసింహా, లక్ష్మయ్య, అనిల్, చిన్న, యాదయ్య, నిరంజన్ తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మురళీధర్‌రెడ్డి, ఎంపీపీ వై. రవీందర్ యాదవ్, గ్రామ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ నాయకులు కురువ గూడెం నర్సింలు, నరేందర్ రెడ్డి, రమేష్ రెడ్డి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.