Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్ ,బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కుమ్మరి శంకర్
నవతెలంగాణ-తలకొండపల్లి
జాతీయ చిరుధాన్యాల పంటలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించినట్టు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కుమ్మరి శంకర్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం వెల్జాల్, పడకల్ రైతు వేదికలో ప్రపంచ చిరుధాన్యాల (2023 సంవత్సరం)పై క్లస్టర్ రైతు సంఘం అధ్యక్షులు నరేందర్‌గౌడ్, పడకల్ రైతు సంఘం అధ్యక్షులు రావిచెట్టు అంజయ్యగౌడ్, ఏఓ శిరీష ఏఓ రాజులతో కలిసి మిలెట్స్పైన రైతులకు కల్టివేట్ చేసే పద్ధతులపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఈ కల్టివేట్ పద్ధతులతో ఏయే పొలాల్లో పంటటు సంమృద్ధిగా పండుతాయే, ఎంత వర్షపాతం అవసరం, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, సబ్సిడీ, మిల్లెట్స్ ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, వీటిపైన రైతులకు అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శరత్, విష్షువర్ధన్, యాదయ్య, రాజు, శ్రీశైలం, సజ్జు పాషా, మల్లేష్, ఆంజనేయులు, రాంరెడ్డి, మస్క వెంకటయ్య, పడకల్ మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, దేవునిపడకల్ ఉపసర్పంచ్ రాజమోని తిరుపతి, కిషన్ నాయక్, విద్య కమిటీ చైర్మెన్ అంబటి లక్ష్మయ్య,మాజీ ఎంపీటీసీ కడమోని రవి,వార్డ్ సభ్యులు కంగుల రవి, గ్రామ ఉప అధ్యక్షులు స్వామి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.